నేటి నుంచి వరల్డ్ కప్ పండుగ షురూ
అహ్మదాబాద్:అక్టోబర్ 05:
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కి కౌంట్ డౌన్ మొదలైంది. వన్డే ప్రపంచకప్ లో భారత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
చివరగా 12 ఏళ్ల కిందట స్వదేశంలో జరిగిన మెగా టోర్నీలో ధోనీసేన వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాతి రెండు ఎడిషన్లలో సెమీఫైనల్స్‌తోనే సరిపెట్టిన భారత్ ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలని ఆశిస్తోంది.
ఇందుకోసం దాదాపు ఏడాది నుంచి భారత జట్టు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతోంది. ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ తొలిసారి భారత జట్టును నడిపించబోతున్నారు.
కాగా, ప్రపంచ కప్ లోని తొలి మ్యచ్ నేడు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది.
ఈ రోజు మధ్యాహ్నం 2:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తపడనున్నాయి.
ఇక, 8వ తేదీన భారత్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యచ్ లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్టుతో పోటీ పడనుంది

