భార్యాపిల్లలను తుపాకీతో కాల్చి ఆపై కానిస్టేబుల్ ఆత్మహత్య..
కడప : వి న్యూస్ : అక్టోబర్ 05:
కడప:- కడపలోని కోపరేటివ్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లలను తుపాకీతో కాల్చి చంపి ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు..
వెంకటేశ్వర్లు ప్రస్తుతం కడప రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు..

