బిజేపి విశాఖ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీందర్ రెడ్డి పర్యటన

బిజేపి విశాఖ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీందర్ రెడ్డి పర్యటన:- 

భీమిలి : వి న్యూస్ ప్రతినిధి : అక్టోబర్ 05 :

భీమిలి నియోజకవర్గం లో భీమిలి రూరల్  మండలంలో రాజుల తాలవలస గ్రామం లో బిజేపి విశాఖ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీందర్ రెడ్డి భీమిలి రూరల్ మండలం లో రాజుల తాల్లవలస గ్రామం లో పర్యటించారు,మేడ పాటి రవీందర్ రెడ్డి ఆయన మాట్లాడుతూ భీమిలీ రూరల్ మండలం లో బిజేపి పార్టీ కార్యకర్తలను కలిసి,బూత్ స్థాయి లో బిజేపి పార్టీ నీ తీసుకెళ్లాలని, కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని, ఆయన కోరారు,వి.వెంకట సాయి చైతన్య వర్మ కి ఆయన నివాసంలో బిజెపి పార్టీ సభ్యత్వం అందజేశారు, రాజులు తాల్ల వలసలో బిజేపి పార్టీ నీ ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో బిజేపి విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి.వి.వి.ప్రసాదరావు పట్నాయక్,విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం ధానేష్ మరియు బిజేపి కార్యకర్తలు పాల్గొన్నారు.