ఉట్టిపడుతున్న ఆధ్యాత్మిక శోభ

ఉట్టిపడుతున్న ఆధ్యాత్మిక శోభ

టైలర్స్ కోలనీలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం

- *శ్రీ విజయ దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు* 

- *అమ్మవారికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు ,హోమాలు* 

*(మధురవాడ - వి న్యూస్అక్టోబర్ 15):*

కొలిచే వారికి కొంగు బంగారం, కోరిన వారికి కోరికలు తీర్చే మహిమ కలిగిన తల్లి శ్రీ విజయ దుర్గాదేవి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి . మధురవాడ ,టైలర్స్ కోలనీలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ విజయ దుర్గాదేవి ఆలయ ధర్మకర్తలు బంగారు సుబ్బారావు,లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ఆలయ ప్రధానార్చకులు శ్రీకాంత్ శర్మ పూజలు నిర్వహించారు. మొదటి రోజు అమ్మవారు విజయ దుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు .ముందుగా ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు బంగారు అశోక్ కుమార్,ఝాన్సీ దంపతులు,బంగారు ప్రకాష్,తెంటు మాధవి లచే అమ్మవారికి పంచామృత సుగంధ ద్రవ్య జలాభిషేకములు,విశేష అలంకరణ అనంతరం కలశ స్థాపన జరిపించారు. అనంతరం   

అమ్మవారి అవతార హోమము ,సహస్ర కుంకుమార్చన నిర్వహించి భక్తులకు 

తీర్థ ప్రసాద వితరణ గావించారు . అదే విధంగా సాయంత్రం ప్రదోషకాల పూజ ,సహస్ర కుంకుమార్చన ,స్వస్తి,తీర్థ ప్రసాద వితరణ గావిస్తారు .

ఏపీ నగరాల కార్పొరేషన్ చైర్మన్ పిళ్ళా సుజాత సత్యనారాయణ దంపతులు,7వ వార్డు వైఎస్సార్ సీపీ అధ్యక్తులు పోతిన శ్రీనివాసరావు,వైఎస్సార్ సీపీ సాంస్కృతిక విభాగం రీజనల్ కో-ఆర్డినేటర్ వంకాయల మారుతీప్రసాద్ తదితరులు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.దీంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక ,భక్తి వాతావరణం సంతరించుకొంది . టైలర్స్ కోలని నుండి మధురవాడ జంక్షన్ వరకు వివిధ దేవతా ప్రతిమలతో కూడిన విద్యుత్ కటౌట్లు ,విద్యుత్ కాంతులీనే స్వాగత తోరణాలు, స్వాగత ఫ్లెక్సీ బోర్డు లను ఏర్పాటు చేసారు . శ్రీవిజయ దుర్గాదేవి అవతారంలో కొలువైయున్న అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు.