ఎండాడ ఎమ్ వి వి సిటీ గేట్ నెంబర్ 2 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.
ఒకరు అక్కడికక్కడే మృతి. ఒకరికి తీవ్ర గాయాలు.
ద్విచక్ర వాహనాన్ని కారు దీకొట్టడంతో ఈ ఘటన.
ఎండాడ: వి న్యూస్ : అక్టోబర్ 15:
జగన్ మోహన్ కుమార్ వయస్సు 43 రాంనగర్ నివాసం కాంట్రాక్టర్ ఇండియా బుల్స్ వద్ద ఒక బిల్డింగ్ కాంట్రాక్టు వర్క్ కొరకు భార్య పిల్లడు తో వెళ్తుండగా ద్విచక్ర వాహనాన్ని డీకొని ఆగ కుండా కొద్ది దూరం వెళ్లిన తరువాత డైవడర్ ని డీకోట్టి నిలిపిన కారు అనంతరం స్పృహ కోల్పోవడం తో ద్విచక్ర వాహనం పై వెళ్తున్న ఉదయ్ కుమార్ వయస్సు 33 అక్కడికక్కడే మృతి చెందగా మరొక వ్యక్తి జగన్ వయస్సు 33 తీవ్ర గాయలువ్వటం తో జగన్ ని కారు డ్రైవర్ జగన్ మోహన్ రావు ని హుటా హుటిన కేజీహెచ్ కి తరలించారు. పీఎం పాలెం ట్రాఫిక్ ఎస్ ఐ మురళి కృష్ణ, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్ట్ మోర్టం నిమిత్తం కేజీహెచ్ కి తరలించి ఘటన వాహనాలను స్టేషన్ కి తరలించి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

