చిన్నాని పరామర్శించిన టిడిపి నాయకలు,రాష్ట్ర రైతు సంఘాల నేతలు
కృష్ణా జిల్లా ప్రతినిధి: వి న్యూస్ : అక్టోబర్ 12:
గన్నవరం నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు,రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి దొంతు చిన్నా ఇటీవల గుండెకు సంబంధించి న ఇబ్బందిలో స్టంటు చేయించుకున్న నేపథ్యంలో బుధవారం ఉదయం గన్నవరంలోని వారి స్వగృహంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నేతలు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి కుర్రా నరేంద్ర తదితరులు ఆయనను పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన త్వరగా కోలుకుని తిరిగి ప్రజా జీవితంలో పాల్గొని,రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు ఘంటా వాసు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు బొమ్మదేవర సత్యనారాయణ, ఏలూరు ఉపేంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.

