బొబ్బిలి నుండి సింహాచలం అప్పన్న స్వామి వారి దర్శనార్థం పాదయాత్ర: RVSSK రంగారావు (బేబీ నాయనా)
బొబ్బిలి: వి న్యూస్ : సెప్టెంబర్ 21:
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నుంచి క్షేమంగా, ఆయురారోగ్యాలతో కడిగిన ముత్యంలా బయటకు రావాలని బొబ్బిలి నియోజకవర్గం ఇన్చార్జి వర్యులు, బొబ్బిలి యువరాజు..RVSSK రంగారావు (బేబీ నాయనా) శుక్రవారం ఉదయం 08:30 గం,, బొబ్బిలి రాజులు ఇలవేల్పు శ్రీ వేణుగోపాలస్వామి వారి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు తీసుకుని అక్కడ నుండి సింహాచలం అప్పన్న స్వామి వారి దర్శనార్థం పాదయాత్ర చేయబోతున్నారు..