గణపతి ఉత్సవాలు నిర్వహించే కమిటీలకు పోలీసు వారు సూచనలు

గణపతి ఉత్సవాలు నిర్వహించే కమిటీలకు  పోలీసు వారు సూచనలు 

విశాఖ జిల్లా : వి న్యూస్ :సెప్టెంబర్ 14:

విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో గణపతి ఉత్సవాలు నిర్వహించే కమిటీలకు పోలీసు వారు సూచనలు తెలిపారు. కమిటీ నిర్వాహకులు తూచా పాటించి చట్ట పరిధిలోనే ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఉత్సవాల్లో కమిటీ నిర్వాహకులు కమిటీ పేరు తెలిపే విధంగా టీ షర్ట్లు ఉంటే ఉత్సవాలకి మరింత సాంప్రదాయత వస్తుందని, అలాగే ఉత్సవాలు జరిగే మండపాల దగ్గర సీసీ కెమెరా  నిఘా వ్యవస్థను ఏర్పరిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా మీరు మాకు సహకరించే వాళ్ళు అవుతారని ఆయన అన్నారు. గంజాయి, మత్తు పదార్థాలు సేవించి ఉత్సవాల దగ్గర శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా పోలీస్ వారు నియమ నిబంధనలు కనుగుణంగా ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు. ఉత్సవాలు నిర్వహించే కమిటీ తప్పకుండా ఉదయం సాయంత్రం ఎవరెవరు ఉంటారో ముందుగానే తెలపాలి. ఉత్సవాల ఆఖరి రోజుల్లో అశ్లీల నృత్యాలు, చట్ట విరుద్ధం మరియు డిజె సౌండ్ లో కాకుండా ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా కాకుండా ఈ ఉత్సవాలు పారిశ్రామిక ప్రాంతంలో భక్తిశ్రద్ధలతో మీ సహకారంతో మా సపోర్ట్ తో జరగాలని ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలియపరిచారు