మేము సైతం బాబు కోసం నినాదం తో :గంటా శ్రీనివాసరావు
విశాఖ :వి న్యూస్ :సెప్టెంబర్ 14:
జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నిరాహార దీక్షలు లో భాగంగా గురువారం మాజీ మంత్రి విశాఖ ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ఎంవిపి కాలనీలో నివాసం నుంచి రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. అందులో భాగంగా సంతకాల సేకరణ చేసి చంద్రబాబుకు మేము సైతం బాబు కోసం నినాదం తో గల బ్యానర్ పై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ , విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇంచార్జ్ చిక్కాల.విజయబాబు మరియు విశాఖ ఉత్తర నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

