వాస్తవాలు ప్రజలకి తెలియజేయండి! గండిగుండం గ్రామ సర్పంచ్ జి. శ్రీనివాస్ వివరణ

వాస్తవాలు ప్రజలకి  తెలియజేయండి! గండిగుండం గ్రామ సర్పంచ్ జి. శ్రీనివాస్ వివరణ

ఆనందపురం:వి న్యూస్ :సెప్టెంబర్ 14:

సెప్టెంబర్06 తేదీన ప్రముఖ దిన  పత్రికలో తనపై తప్పుడు ఆరోపణలతో వచ్చిన వార్తలో 

వాస్తవం లేదని విశాఖ జిల్లా ఆనందపురం మండలం గండిగుండం గ్రామ సర్పంచ్ జి. శ్రీనివాస్ వివరణ ఇచ్చారు... 

తాను గ్రామంలో ఉన్న ప్రజలందరితో మమేకమై కలిసి తిరుగుతానని గ్రామ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని అందువలన నా రాజకీయ ఎదుగుదలను  చూసి ఓర్వలేని కొంత మంది వ్యక్తులు తన పై తప్పుడు వార్తలు రాయించడం సబువు కాదని మీడియా సమావేశంలో జి. శ్రీనివాస్ తెలిపారు... 

వార్త పత్రికలంటే తనకు అపారమైన గౌరవం ఉందని నా గురించి ఊరి ప్రజలను పూర్తి వివరాలు అడిగి వాస్తవాలు రాయలని పత్రికల వారిని కోరుకుంటున్నానని తెలిపారు..