ఘనంగా జరిగిన పిళ్లా సత్యనారాయణ వేడుకలు

 ఘనంగా జరిగిన పిళ్లా సత్యనారాయణ వేడుకలు

వి న్యూస్ ఎండాడ 17

విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో 8వ వార్డ్ ఎండాడ పనోరమహిల్స్ వద్ద గల విశాఖజిల్లా వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో వైస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు ఆధ్వర్యంలో వైస్సార్సీపీ సీనియర్ నాయకులు పిళ్ళా సత్యనారాయణ తో కేక్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కోలా గురువులు మాట్లాడుతూ పార్టీ కోసం నిబద్దతతో పనిచేసిన ప్రతిఒక్కరికి పార్టీ తగిన గుర్తింపు ఇస్తుంది అని అన్నారు.

సత్యనారాయణకు భీమిలి నియోజకవర్గం శాసన సభ్యులు అవంతి శ్రీనివాసరావు,ఉత్తర నియోజకవర్గం సమన్వయ కర్త, నెడ్ క్యాప్ చైర్మన్ కేకే రాజు,నగరాలు కార్పొరేషన్ ఛైర్పర్సన్ పిళ్ళా సుజాత, పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి రవిరెడ్డి,సింహాచలం దేవస్థానం పాలకమండలి సభ్యురాలు  ఎమ్. రాజేశ్వరి మరియు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.