టీడీపీ నాయకులు చేస్తున్న నిరసనకు సంఘీభావం తెలిపిన భీమిలి జనసేన నాయకులు

టీడీపీ నాయకులు చేస్తున్న నిరసనకు సంఘీభావం తెలిపిన భీమిలి జనసేన నాయకులు.

వైస్సార్సీపీ తో పోరాటంలో కలిసి పోరాడదాం అంటున్న భీమిలి జనసైనికులు.

భీమిలి : వి న్యూస్ : సెప్టెంబర్ 17:

టిడిపి అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ భీమిలి నియోజకవర్గం టిడిపి ఇంఛార్జి అయినటువంటి కోరాడ రాజబాబు అధ్యక్షతన భీమిలి టిడిపి కార్యాలయంలో చేస్తున్న నిరసన కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి డాక్టర్ సందీప్ పంచకర్ల ఆదేశాల మేరకు భీమిలి జనసేన నాయకులు టిడిపి శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గుడివాడ కిరణ్, కొయ్య శ్రీనివాస్రెడ్డి,నవిరి రాజు,రామోజీ సతీష్, ఎరుసు సూరి రెడ్డి, రాజగిరి. సురేష్,పి అప్పలరాజ, స్వరాజ్,ఇద్దిపిల్లి నానాజీ,చందు,హేమంత్ మరియు జన సైనికులు పాల్గొన్నారు .