వైసిపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తోంది

వైసిపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తోంది

ఆత్మగౌరవ సభకు అనుమతులు ఇవ్వకపోవడం దారుణం

ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు

-----తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్

విశాఖపట్నం: వి న్యూస్ :సెప్టెంబర్ 17:

విశాఖపట్నం : తెలుగు జాతి ఆత్మగౌరవం పేరుతో తాను నిర్వహించాల్సిన సభకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని వైసిపి ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని.. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఆదివారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈనెల 17వ తేదీన అంటే ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రామకృష్ణ బీచ్ లో బహిరంగ సభ నిర్వహించాల్సి ఉందన్నారు. అయితే ఈనెల 13వ తేదీన సభకు అనుమతి కోరుతూ జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించమని తెలిపారు. అయితే వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా గుడివాడ అమర్ తన సభకు భయపడి అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తను జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించినప్పుడే.. నిజంగా దమ్ముంటే తన బహిరంగ సభకు అనుమతి ఇప్పించాలని మంత్రి గుడివాడ అమర్ కు సవాల్ చేశానన్నారు. కానీ గుడివాడ అమర్ బహిరంగ సభకు అనుమతులు ఇప్పించలేకపోయారు గాని.. చంద్రబాబు నాయుడు మాత్రం విమర్శించడంలో ముందుంటున్నారని ఎద్దేవా చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని మంట కలుపుతుంటే .. తాను ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని రామ్ ప్రశ్నించారు. ఏది ఏమైనా ఎప్పటికైనా ప్రజాస్వామ్యంలో అంతిమ విజయం ప్రజలదేనని.. రాబోయే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.