విద్యార్ధి మరణం పై విచారణ జరపి చర్యలు తీసుకొండి - గిరిజన విద్యార్ధి సంఘం

విద్యార్ధి మరణం పై విచారణ జరపి చర్యలు తీసుకొండి - గిరిజన విద్యార్ధి సంఘం

అల్లూరి జిల్లా,పాడేరు పెన్ షాట్ న్యూస్ సెప్టెంబర్ 19 :-

విద్యార్ధి మరణం పై విచారణ జరపి చర్యలు తీసుకోవాలని గిరిజన విద్యార్ధి సంఘం ప్రధాన కార్యదర్శి బూడిద మాధవరావు డిమాండ్ చేసారు.అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లో గల యు చీడిపాలెం బాలుర ఆశ్రమ పాఠశాల వద్ద 4వ తరగతి చదువుతున్న వంశీకృష్ణ ఈనెల 13వ తేదీన పాఠశాలలోనే చనిపోవడం జరిగింది .ఆ విద్యార్థి చనిపోయి నాలుగు రోజులు గడుస్తున్న ఆ పాఠశాలలో పనిచేస్తున్న వార్డెన్ పై ఎటువంటి చర్యలు తీసుకోపోవటం దుర్మార్గమని, ఈ మరణం జరగడానికి గల కారణాలు ఏమిటంటే ఆ పాఠశాలలో పనిచేస్తున్న వార్డెన్ పిల్లలకు సరిగ్గా చూసుకోక పోవటం ,అలాగే సంబంధిత అధికారులు ఎటువంటి పర్యవేక్షణ చేయకపోవడం,విద్యార్ధుల తల్లిదండ్రులకు,విద్యార్ధి సంఘాలకు,ఇతర ప్రజా సంఘాలకు పాఠశాల ఆవరణలోకి రావొద్దని హుకుం జారీ చేసిన అధికారులు విద్యార్ధి మరణాలపై నోరు మెదపడం లేదు.ఈ గిరిజన విద్యార్థి మరణానికి కారణమైనటువంటి వారిని కఠినమైన చర్యలు తీసుకొని మృతి చెందిన విద్యార్థికి తగిన న్యాయం చేయాలని అలాగే అన్ని పాఠశాలలో హెల్త్ అసిస్టెంట్స్ లను నియమించాలని గిరిజన విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగదీష్,రామకృష్ణ, డానియల్,రవి పాల్గొనడం జరిగింది.