మాధురి విద్యాలయoలో రెడ్ కలర్ డే వేడుకలు

మాధురి విద్యాలయoలో రెడ్ కలర్ డే వేడుకలు.

కాకినాడ: వి న్యూస్ ప్రతినిధి :ఏప్రిల్ 01

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం కత్తిపూడి మాధురి విద్యాలయoలో రెడ్ కలర్ డే వేడుకలు ఉత్స‌హా భ‌రితంగా జ‌రిగాయి.ఈ కార్యక్రమానికి  మాధురి విద్యా సంస్థల అధినేత కే టి నాయుడు దంపతులు ముఖ్య అతిధులుగా విచ్చేసారు.ఎల్కేజి యూకేజీ ఒకటవ తరగతి నుంచి పదవ త‌ర‌గ‌తి వ‌ర‌కు ఉన్న విద్యార్దులు అంద‌రు రెడ్ క‌ల‌ర్ డ్ర‌స్సుల‌తో రెడ్ క‌ల‌ర్ డేలో పాల్గొన‌డంతో పాఠ‌శాల అంతా అరుణ వర్ణంగా మారింది.విద్యార్దులు చ‌క్క‌గా త‌మ క్లాసు రూమ్‌ల‌ను ఎరుపు రంగు కార్టూన్స్ తో అలంక‌రించారు. అదేవిధంగా చిన్నారులందరు త‌మ‌కు అందుబాటులోఉన్న ఎర్ర‌టి ఆహార ప‌దార్ధాలు, కాయ‌లు, పండ్లు, తినుబండారాల‌ను సేక‌రించి రెడ్ క‌ల‌ర్ డే వేడుకల్లో ప్ర‌ద‌ర్శ‌నగా పెట్టారు.

ఈ సందర్బంగా మాధురి విద్య సంస్థల అధినేత కే టి నాయుడు మాట్లాడుతూ ఆయా రంగుల‌లో దొరికే ఆహార ప‌దార్ధాల విశిష్ట‌త‌ను మరియు రెడ్ కలర్ విశిష్ట‌త‌ను వివరించారు.మాన‌వులంతా స‌మానం అని నిరూపించే ర‌క్తం రంగు ఎరుపు అన్న విష‌యం గుర్తు చేశారు. సృష్టిలోని ప్ర‌తి జీవి ర‌క్తం ఎర్ర‌గానే ఉంటుంద‌ని అన్నారు. ఎర్ర‌టి రంగు క‌లిగిన పండ్లు కాయ‌లు ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ని తెలిపారు. రెడ్ క‌ల‌ర్ డే వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించిన ఉపాధ్యాయ వ‌ర్గాన్ని ప్ర‌త్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాధిక, ఇంచార్జి రహిమా, ప్రధానోపాధ్యాయులు ఆదినారాయణ, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.