వ్యవసాయ చెరువులు మాయం:- రియల్ ఎస్టేట్ కి దార దత్తం చేస్తున్న రెవెన్యూ అధికారుల పై చర్యలు తీసుకోవాలని :-బిజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వి.ఎన్. మాధవ్ డిమాండ్

వ్యవసాయ చెరువులు మాయం:- రియల్ ఎస్టేట్ కి దార దత్తం చేస్తున్న   రెవెన్యూ అధికారుల పై చర్యలు తీసుకోవాలని :-బిజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వి.ఎన్. మాధవ్ డిమాండ్:-

ఆనందపురం: వి న్యూస్ఏ ప్రతినిధి: ఏప్రిల్ 01

వ్యవసాయ చెరువులను మాయం చేస్తూ, రియల్ ఎస్టేట్ వ్యాపారం ధార్లకు, ధార దత్తం: పి.వి.ఎన్.మాధవ్

భీమిలి నియోజకవర్గం,పద్మనాభo మండలంలో వ్యవసాయ చెరువులను మాయం చేస్తూ, రియల్ ఎస్టేట్ వ్యాపారం ధార్లకు, ధార దత్తం చేస్తున్న, సంబంధిత రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని,ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి,పి.వి.ఎన్.మాధవ్ డిమాండ్ చేసారు.పద్మనాభo మండలం,రేవిడి గ్రామానికి చెందిన, యాతవాని చెరువు, నేరల్ల వలస గ్రామానికి చెందిన, నేరల్ల చెరువు, నరసింగరావు చెరువు,పొట్నూరు చెందిన శివన్న కోనేరు, కబ్జాలకు గురైన సందర్భంగా,భారతీయ జనతా పార్టీ ప్రతినిధులతో   సందర్శించారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెవెన్యూ అధికారులు,చెరువులకు వారసత్వం హక్కు ఉన్నట్టు, అడంగల్, వన్ బి, ఆన్లైన్లో నమోదు చేయడమే కాకుండా, పట్టాదారు పాస్ పుస్తకాలు, పంపిణీ చేయడం వెనక, ఆ చెరువులను, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు జారీ చేయడం వెనక పెద్ద కుట్ర జరుగుతుందని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి పద్మనాభo మండల అధ్యక్షులు,రెడ్డి పల్లి శ్రీను వాసరావు, బిజేపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఉప్పాడ అప్పారావు, బిజేపి కిసాన్ మోర్చా ఉత్తరాంధ్ర జోన్ సోషల్ మీడియా కన్వీనర్,పి.వి.వి.ప్రసాదరావు పట్నాయక్, బిజేపి రాష్ట్ర మెడికల్ సెల్ కన్వీనర్,రూపకుల రవికుమార్,  భీమిలి నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ కె.రామ నాయుడు,బిజెపి మండల ప్రధాన కార్యదర్శి, మహంతి అప్పల రమణ, సారిక ప్రకాష్ రావు, మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.