మ్యాట్ లో మెరిసిన సిక్కోలు ఆణిముత్యం
శ్రీకాకుళం: వి న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ -01
ప్రతిష్టాత్మక మేనేజ్ మెంట్ ఆప్టిట్యూట్ టెస్ట్ లో శ్రీకాకుళం కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ బిబిఎ విద్యార్ధి సంతోష్ అగర్వాల్ 94.16 % సాదించి తన ప్రతిభను కనబరిచాడని కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎన్.వి. వేణుగోపాల్ తెలిపారు. ప్రముఖ బిజినెస్ స్కూల్స్ తో పాటూ మేనేజ్ మెంట్ సంస్థలు ఉమ్మడిగా నిర్వహించే మ్యాట్ లో 705 స్కోర్ సాధించి ముందంజలో నిలిచారని, ప్రతిభ చూపిన వారికి ఎన్నో ప్రముఖ మేనేజ్ మెంట్ సంస్థలు తో పాటూ బిజినెస్ స్కూల్స్ లో పిజి మేనేజ్ మెంట్ ప్రోగ్రాం చేసే అరుదైన అవకాశం లభిస్తుందన్నారు. ప్రిన్సిపల్ ఎన్.వి వేణుగోపాల్ మాట్లాడుతూ ఆదిత్య డిగ్రీ కళాశాలలో బిబిఎ కోర్సు ను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామనీ, ఎన్నో క్యాంపస్ ఇంటర్వ్యూ లలోనే కాకుండా ప్రతిష్టాత్మక సంస్థలలో ఎమ్.బిఎ అవకాశాలను అందిపుచ్చుకుంటారని తెలిపారు.అనంతరం కళాశాల అకడమిక్ డైరెక్టర్ శ్రీ బి ఈ వి ఎల్ నాయుడు మాట్లాడుతూ తమ ఆదిత్య డిగ్రీ కళాశాలలో విద్యార్ధులకు అత్యున్నత భవిష్యత్తు అంధించే విధంగా క్యాంపస్ ఇంటర్వ్యూ లను అందిస్తున్నామనీ సంతోష్ ని మ్యాట్ లో మెరిసిన సిక్కోలు ఆణిముత్యమన్నారు. అనంతరం సంతోష్ అగర్వాల్ ను ఆదిత్య కళాశాలల చైర్మెన్ ఎన్ శేషారెడ్డి, సెక్రెటరీ సుగుణరెడ్డి, శ్రీకాకుళం డైరెక్టర్ బీఎస్. చక్రవర్తి, మేనేజ్ మెంట్ విభాగాధిపతి ప్రభాకర్ రావు, దీపికా, శ్రావణీలు అభినందించారు.

