జాతీయస్థాయి తైక్వాండో పోటోల్లో అద్వితీయమైన ప్రదర్శన

జాతీయస్థాయి తైక్వాండో పోటోల్లో అద్వితీయమైన ప్రదర్శన


ద్వితీయ స్థానం సాధించిన జిల్లా క్రీడాకారుడు ఆకుల ప్రశాంత్

శ్రీకాకుళం:వి న్యూస్ :ఏప్రిల్ 01

జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారుడు అద్భుతమైన ప్రదర్శన కనబరచి రజిత పథకాన్ని సొంతం చేసుకున్నాడు. 

రాజస్థాన్ రాష్ట్రంలో కోట విశ్వాలయం వేదికగా గత నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగిన జాతీయస్థాయి సబ్ జూనియర్ తైక్వాండో పోటీల్లో బాలికల విభాగంలో దువ్వు త్రివేణి, పెద్దిన యషిత, క్యాడెట్ బాలుర విభాగంలో ఆకుల ప్రశాంత్, తాన్ని ఢిల్లీశ్వరరావు, జి. హిమచందన్, గొర్లె రిత్విక్ పాల్గొని ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చారు. 

 శ్రీకాకుళం నగరం హయతినగరం రేల్ల వీధికి చెందిన ఆకుల ప్రశాంత్ సబ్ జూనియర్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున జిల్లా నుండి ప్రాతినిత్యం వహించాడు. పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు శ్రీకాకుళం జిల్లా టైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొమర భాస్కరరావు శనివారం తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 8 పతకాలు రావడం ఇదే తొలిసారి. వీటిలో ఒక స్వర్ణం, రెండు రజితాలు, 5 కాంస్య పతకాలను క్రీడాకారులు సాధించారు. 

ఈ సందర్భంగా విజేతలను శిక్షకులు భాస్కరరావులను న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి అచ్యుత రెడ్డి, శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి గార పగడాలమ్మ, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎంవి రమణ, ఎం సాంబమూర్తి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ముఖ్య సలహాదారు పెంకి సుందరరావు, వుషూ అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి రెడ్డి శివకుమార్, తదితరులు అభినందించారు.