సత్యకుమార్ పై దాడిని ఖండించిన బీజేపీ కిసాన్ మోర్చా ఉత్తరాంధ్ర జోన్ సోషల్ మీడియా కన్వీనర్ పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్

సత్యకుమార్ పై దాడిని ఖండించిన బీజేపీ కిసాన్ మోర్చా ఉత్తరాంధ్ర జోన్ సోషల్ మీడియా కన్వీనర్ పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్.

భీమిలి: వి న్యూస్ ప్రతినిధి :ఏప్రిల్ 01

విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం లో ఆనందపురం లో సత్యకుమార్ పై దాడిని ఖండించిన బీజేపీ కిసాన్ మోర్చా ఉత్తరాంధ్ర జోన్ సోషల్ మీడియా కన్వీనర్ పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ నిరసన వ్యక్తం చేశారు.

మూడు రాజధానుల శిబిరం వద్ద సత్య కుమార్ వాహనంపై 

దుండగుల రాళ్లదాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.

అమరావతి ఉద్యమానికి మద్దతు పలికి వస్తున్న బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై దాడిని ఖండిస్తున్నామని బిజెపి కిసాన్ మోర్చా ఉత్తరాంధ్ర జోన్ సోషల్ మీడియా కన్వీనర్ పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్, మాట్లాడుతూ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై వైసీపీ మూకలు దాడులకు పాల్పడుతున్నాయని వైఎస్ఆర్ సీపీ పార్టీ దుర్మార్గానికి వ్యతిరేక గళం లేకుండా చేయాలనుకొంటుందని అన్నారు.అక్కడ రైతులు తరతరాలుగా బతుకు ఆదారమైన భూమిల్ని ప్రజారాజధాని అమరావతికోసం ఇచ్చిన మీత్యాగం వృదాగా పోదని ఒకేరాజదాని- ఒకే రాష్ట్రం నినాదంతో మీరుచేపట్టిన అలుపెరగనిఉద్యమానిదే అంతిమ విజయం అని పేర్కొన్నారు.మూడు ముక్కలాట సర్కారు కుట్రలు, నిర్భందాలు,దాడులకి ఎదురొడ్డి నిలిచి 1200 రోజులుగా పోరాడుతున్న మీ అందరకీ అభివందనాలు ఉద్యమిస్తున్న రైతులకు మద్దతు తెలిపారు.