నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
అమరావతి :
నేటి నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. విద్యార్థులు ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఈ ఏడాది టెన్త్ ఎగ్జామ్స్క 6,64,152మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందుకోసం 3,449 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
