నేటి నుంచి పెన్షన్ డబ్బుల పంపిణీ.
అమరావతి :
వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి పెన్షన్లు పంపిణీ చేయనుంది.సోమవారం నుంచి 5 రోజుల పాటు వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా 63,42,805 మంది లబ్ధిదారులకు రూ.1,747.88కోట్లను పంపిణీ చేయనున్నారు.

