ఘనంగా శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి జాతర మహోత్సవాలు.
విశిష్ట అతిథులుగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్న5,7 వార్డుల కార్పోరేటర్లు.
వి న్యూస్ మధురవాడ
జీవీఎంసీ జోన్-2 లో 5,7వార్డుల పరిధి మధురవాడ,స్వతంత్రనగర్ లో కొలువైఉన్న శ్రీలక్ష్మీ దేవి అమ్మవారి జాతర మహోత్సవాలు,మరియు 7వ వార్షికోత్సవ కలశ ప్రతిష్ట అంకురార్పణ ఘనంగా నిర్వహించారు.గురువారం నుంచి మొదలైన జాతర మహోత్సవాలు శనివారం ముగుస్తాయని,ఆదివారం మధ్యాహ్నం అన్నసంతర్పణ నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షులు వాసుపిల్లి బండియ్య,కార్యదర్శి బాలుపాత్రో తెలియజేశారు.
స్వతంత్రనగర్ పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.అతిథులుగా విచ్చేసిన 5వవార్డ్ కార్పొరేటర్ మొల్లిహేమలత,రమణ,7వ వార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ,వెంకటరావు,టిడిపి రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శి మొల్లిలక్ష్మణరావు,టిడిపి సీనియర్ నాయకులు వాండ్రాశి అప్పలరాజు,నమ్మి శ్రీను,పొట్టి ప్రసాద్,కనకదుర్గ ఈవెంట్స్.. కొర్రాయి సురేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి, కలశస్థాపన కావించి జ్యోతి ప్రజ్వలనచేసి జాతరను ప్రారంభించారు.ఈజాతర మహోత్సవ పూజాకార్యక్రమాలు ఆలయ అర్చకులు పూలఖండం గౌరీ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు.కార్యక్రమంలో ఆలయ కోశాధికారి కొత్తాల శ్రీను,ఆర్గనైజింగ్ సెక్రటరీ దిబ్బశ్రీను,ఉప కోశాధికారి దాదిగౌరీశంకర్,అనుపోజు నాగరాజు,బావిశెట్టి జగన్,...కరకాని ఈశ్వరరావు, జోగేశ్వరపాత్రో,ఈరోతి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

