మధురవాడ వాంబేకాలనీలో కిడ్నీ బాధితుని పిర్యాదు తో బయటపడ్డ కిడ్నీ రాకెట్.
మధురవాడ:వి న్యూస్ :ఏప్రిల్ 27
మధురవాడ, పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు
గోరు జల్ల వినయ్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పీఎం పాలెం పోలీసులు.
న్యాయం చేయాలంటూ బాధితుడు జి వినయ్ కుమార్ డిమాండ్.
కిడ్నీ బాధితుడు వాంబేకాలనీలో నివాసం ఉంటూ
కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వాంబేకాలనీ లో కామరాజు అనే యువకుడు మద్యం దుకాణం దగ్గర పరిచయం అవ్వగా అతనితో ఇంట్లో పరిస్థితి బాలేదు అని బాధను వెళ్ళబుచ్చాగా కామరాజు కిడ్నీ అమ్మితే ఎనిమిది లక్ష యాభై వేల రూపాయలు వస్తాయని సలహా ఇచ్చాడని తెలిపారు.కామరాజు కెజిహెచ్ డౌన్ లో ఉన్న విజయ హాస్పిటల్ దగ్గర కిడ్నీ కి సంబంధించిన టెస్ట్ లను చేయించారని అన్నారు . అయితే ఈ విషయం వినయ్ కుమార్ తల్లితండ్రులకు తెలిసిపోవటంతో నువ్వు ఇక్కడ ఉండద్దు అని హైద్రాబాద్ కు పంపించేశారని అన్నారు. కామరాజు అనే వ్యక్తి వినయ్ కుమార్ కి ఫోన్ చేసి మీ ఇంట్లో సమన్లు తీసుకువచ్చేస్తాను, మీ అమ్మానాన్నలను రోడ్ మీదకి లాగెస్తాను అని బెదిరించగా . హైద్రాబాద్ నుంచి రాత్రి బయలుదేరి విశాఖ కు వచ్చిన వెంటనే రైల్వే న్యూ కాలనీ వద్ద నుండి పెందుర్తికి తీసుకువెళ్లి పెందుర్తి దగ్గర ఉన్న తిరుమల హాస్పిటల్ కి తీసుకువెళ్లారని అన్నారు. వెంటనే మత్తు ఇంజక్షన్ ఇచ్చి కిడ్నీ తీసేసి అక్కడే నిర్లక్ష్యం గా వదిలేసారని అన్నారు . వినయ్ కుమార్ క్యాబ్ లో ఇంటికి వచ్చాక ఐదు లక్షలు ఇస్తున్నట్లు వీడియో తీయించి, తన తండ్రికి 250000 ఇచ్చి మిగతావి పట్టుకు వెళ్లిపోయారని అన్నారు.
ఎనిమిధి లక్షలకు ఒప్పుకుని, 250000 ఇచ్చారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వినయ్ కుమార్ కి మందులు కూడా ఇవ్వలేదని . హాస్పిటల్ లో కూడా కిడ్నీ తొలగించిన తరువాత కుక్క లాగా వదిలేశారని ఆవేదన వ్యక్తం చేసారు. క్యాబ్ లో ఇంటికి వచ్చి . వారం రోజులు బాగానే నడిచాను కానీ ఇప్పుడు నేను నడవలేకపోతున్నాను అని అంటున్నారు నాతో పాటుగా మరో ఒక యువకునికి కూడా అలాగే మోసం చేశారు అని తెలిపారు. ఇంకా ఎంత మంది బాధితులు ఉంటారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.విషయం తెలుసుకున్న అధికారులు మధురవాడ పి హెచ్ సి వైద్యులు, ఆశ వర్కర్లు సిబ్బంది
వాంబే కాలనీ కిడ్నీ బాధితుడు వినయ్ కుమార్ ఇంటికి వెళ్లి
బాధితుడు వైద్యాధికారిని డాక్టర్ ప్రశాంతి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియా తో మాట్లాడుతూ
పై అధికారుల ఆదేశాలు మేరకు కిడ్నీ బాధితుడు వినయ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి వచ్చామని నాలుగు నెలలుగా వినయ్ కుమార్ కు నీరసంగా ఉందని చెప్పడం జరిగింది అని ఇంతవరకు ఎక్కడ కూడా ట్రీట్మెంట్ చేయించుకోలేదు అని చెప్పారని అన్నారు.వాళ్ల తల్లితండ్రులుతో కూడా మాట్లాడాము అని బిపి కూడా నార్మల్ గానే ఉంది వినయ్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని మా పై అధికారులకు తెలియచేసి సాయంత్రం అంబులెన్సు లో తక్షణ చికిత్స నిమిత్తం ఆసుపత్రి కి తరలిస్తున్న సమయంలో కుటుంబ సభ్యులు స్థానికులు వినయ్ కుమార్ కి కలెక్టర్ స్పందించి న్యాయం చెయ్యాలని కోరుతూ న్యాయం జరిగే వరకు పంపేది లేదని బాధితునితో రోడ్డు పై బైటాయించి నిరసన తెలిపారు. వైద్యులు సిబ్బంది వారికి వినయ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి వివరించి తక్షణం వైద్యం అందించాలని లేకపోతే ప్రమాదమని సూచించి ఆసుపత్రికి తరలించారు. అనంతరం స్థానికులు కుటుంబ సభ్యులు మీడియా తో మాట్లాడుతూ కిడ్నీ బాధితుడు వినయ్ కుమార్ కి కలెక్టర్ స్పందించి మెరుగైన వైద్యం అందించి మోసం చేసిన వారిని పట్టుకొని వారి వద్ద నుండి తనకు రావలసిన మొత్తం ఇప్పించి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.


