విశాఖపట్నం నగరంలోని ఆరు స్థానాలు తాత్కాలిక రెడ్ జోన్లు
విశాఖపట్నం:
విశాఖపట్నం నగరంలోని ఆరు స్థానాలనుమరియు జి-20 సదస్సు కు హాజరుకానున్న ప్రతినిధులు ప్రయాణించు మార్గాలలో "తాత్కాలిక రెడ్ జోన్"గా డ్రోన్ ఫ్లయింగ్ కార్యాచరణ ప్రకటన.
డ్రోన్ రూల్స్, 2021లోని రూల్ నెం.24 సబ్ రూల్ (2) ప్రకారం అందించబడిన అధికారాల ప్రకారం, విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ సిహెచ్.శ్రీకాంత్, ఐ.పి.ఎస్. విశాఖపట్నం నగరంలో ఈ క్రింది స్థలాలను మరియు జి-20 సదస్సు కు హాజరుకానున్న ప్రతినిధులు ప్రయాణించు మార్గాలలో"తాత్కాలిక రెడ్ జోన్"గా ప్రకటించడం జరిగినది. మార్చ్ 27 న 12:00 గంటల నుండి మార్చ్31 న 12:00 గంటల వరకు 4 రోజుల (96 గంటలు) వ్యవధిలో జి-20 సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో :
1) రాడిసన్ బ్లూ రిసార్ట్స్,
2) ముడసర్లోవ పార్క్,
3) కైలాసగిరి కొండ,
4) ఆర్.కె. బీచ్,
5) జిందాల్ వేస్ట్ నుండి ఎనర్జీ ప్లాంట్, కాపులుప్పాడ మరియు
6) ఎస్.సి.ఏ.డి.ఏ , మాధవధార.
అందువల్ల, పైన పేర్కొన్న వేదికలు/స్థానాలకు చుట్టుపక్కల 2 కిలోమీటర్ల పరిధిలోని పరిధీయ ప్రాంతంలో డ్రోన్‌ల ఎగురడం/నిర్వహణ నిషేధించబడింది. RPAS (డ్రోన్‌లు)తో సహా సంప్రదాయేతర వైమానిక వస్తువులను ఎగురవేయడంపై నిషేధం విధించడమైనది,ఈ నిషేధాన్ని ఉల్లంఘించినట్లు (డ్రోన్లు) సహా ఏవైనా సాంప్రదాయేతర వైమానిక వస్తువులు ఎగురవేసిన యెడల ఎటువంటి బాధ్యత లేకుండా వాటిని నాశనం చేయబడుతుంది/జప్తు చేయబడుతుంది, మరియు చట్టప్రకారం ఐపీసీ యొక్క సంబంధిత సెక్షన్ కింద చర్యలు తీసుకోబడతాయి.

