విశాఖ లో వెలుగు చూస్తున్న మెట్రో మోసాలు

విశాఖ లో వెలుగు చూస్తున్న మెట్రో మోసాలు..

మారికవలస వి న్యూస్ మార్చి 24

భీమిలి : మధురవాడ మారికవలస మెట్రో హోల్ సెల్స్ మాల్ లో తప్పడు  బిల్లుల తో కస్టమర్లను బురిడి.... 

 సంబరాల పేరుతో కస్టమర్లను నిలువు దోపిడి రేటు ఒకటి బిల్లు ఒకటి కస్టమర్లకు షాక్ ఇస్తున్న మెట్రో సంస్ద.లబోదిబో అంటున్న కస్టమర్లు విజిలెన్స్ వైఫల్యం తో విచ్చల విడిగా దోపిడిలు. చాలా కాలంగా ఇదే విధంగా దోపిడి చేస్తున్నరని ఆరోపణ లు.

వివరాలు : జీవీఎంసీ జోన్ టు 6వ వార్డ్ పరిధిలోని పోతిన మల్లయ్య పాలెం ప్రాంతానికి చెందిన సంతోష్ బెహర 5వ వార్డ్ లో ఉన్న మెట్రో (హోల్సేల్ నిత్యవసర సామాగ్రి షాప్ )ప్రారంభమైన అప్పటినుంచి తరచుగా సరుకులు కొనుగోలు చేస్తానని అలాగే ఎప్పటిలాగే శుక్రవారం కూడా నిత్యవసర సరుకులు కొనుగోలు చేసుకోవడానికి వచ్చారు. 

నిత్యవసర సరుకులు తీసుకొని బిల్లింగ్ కౌంటర్ కి వెళ్ళగా మొత్తం సరుకుల రుసుము మెట్రో యాజమాన్యానికి రుసుము చెల్లించిన తర్వాత బిల్ చెక్ చేసుకోగా కొన్ని నిత్యా అవసర సరుకుల పై   చెప్పిన దానికన్నా ఎక్కువ రుసుము బిల్లింగ్ వేశారని యాజమాన్యాన్ని అడగగా వాళ్లు సరైన సమాధానం చెప్పలేదని సంతోష్ మీడియా ద్వారా తెలిపారు. మరల వేరే కొనుగోలుదారుడకు కూడా అలాగే జరిగిందని. అలాగే ఈ మెట్రోలో తీసుకున్న బెల్ కంపెనీకి చెందిన బియ్యం లో  పురుగులు ఉన్నాయని కొనుగోలుదారులు మీడియా సమక్షంలో తెలిపారు. 

ఈ విధంగా రోజుకి ఎంతోమంది హడావుడిగా వెళ్లిపోవడంలో బిల్లు చెక్ చేసుకోకపోవడం వల్ల ఎంత నష్టపోతున్నారు అని సంతోష్ బేహారా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సివిల్ సప్లై అధికారులు విజిలెన్స్ డిపార్ట్మెంట్లు అధికారులు తక్షణమే స్పందించి ఇలాంటి మోసాలు జరగకుండా కొనుగోలుదారులకు న్యాయం చేస్తారని సంతోష్ బెహరా అధికారులను కోరారు.