చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది ఉత్సవాలు

చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది ఉత్సవాలు.

చంద్రంపాలెం:వి న్యూస్

మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు పై కొలువైయున్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో  ఉగాది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి, ముందుగా అమ్మవారికి సుప్రభాత సేవ, నిత్య అర్చనలు, పంచామృత సుగంధ జలాభిషేకం ఆలయ అర్చకులు పట్నాల సుబ్బారావు శర్మ, హరి ప్రసాద్ శర్మ, రాంబాబు శర్మ, మూర్తి శర్మ తదితరులు జరిపించి అనంతరం అలంకరణ పుష్పార్చన, కుంకుమార్చన మొదలగు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది, అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది,  అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనాలు కల్పించుట జరిగింది, సాయంత్రం ఆలయ ప్రాంగణంలో దీపారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా ఉగాది పచ్చడి, ప్రసాదం భక్తులందరికీ పంపిణీ చేయడం జరిగింది, మరియు యస్.ఆర్.బాబు దంపతులు, ప్రసాద్

దంపతులు ఏర్పాటు చేసిన తీపి బూంది ప్రసాదము భక్తులకు పంపిణీ చేయడం జరిగింది, 

ఈ సందర్భంగా చంద్రంపాలెంలో శ్రీ లక్ష్మి నారసింహ  మహిళా కోలాటం గ్రూప్ 27మందితో ఏర్పాటు చేసుకొని సిరిపురపు సంతోషి గురువు ఆధ్వర్యంలో నేర్చుకొని ప్రప్రథమంగా చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో  తెలుగు నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా కోలాటం ప్రదర్శించడం జరిగింది, 

ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిళ్లా చంద్రశేఖర్, ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, కమిటీ సభ్యులు, చంద్రంపాలెం గ్రామ పెద్దలు, ఆలయ ముఖ్య సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.