జనసేనలోకి యువనాయకుడు

జనసేనలోకి యువనాయకుడు.

నక్కాశ్రీధర్ ను పార్టీలోకి ఆహ్వానించిన జనసేనాని.

మధురవాడ: 

జగదభి రామ కన్స్ట్రక్షన్స్ అధినేత, మధురవాడ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నక్కాశ్రీధర్ జనసేన పార్టీలో చేరారు.బుధవారం హైదరాబాద్ లో గల జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ కండువా వేసి నక్కా శ్రీధర్ ను పార్టీలోకి ఆహ్వానించారు. కాపు(తెలగ) సామాజిక వర్గానికి చెందిన నక్కాశ్రీధర్ భీమిలి నియోజకవర్గం మధురవాడ ప్రాంతానికి సుపరిచితులు. యువతను రాజకీయాల్లో ప్రభావితం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఆశయాలకు, ముఖ్యంగా రాజకీయం అంటేనే పదవి వ్యామోహం అని, అటువంటి పదవులు తృణప్రాయంగా దూరం పెట్టి కల్మసం లేని ఆయన నాయకత్వ లక్షణాలకు ఆకర్షితుడయ్యానని ఈ సందర్బంగా నక్కా శ్రీధర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ పంచకర్ల సందీప్,జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.