కార్మిక, కర్షకుల చలో ఢిల్లీ గోడ పత్రిక ఆవిష్కరణ..
మధురవాడ వి న్యూస్
ఏప్రిల్ 5 న కార్మికులు, రైతులు,వ్యవసాయ కార్మికులు ,కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల తో పాటు,గిరిజన హక్కులు, వనరుల రక్షణ,ప్రభుత్వ రంగ పరిశ్రమలు,ఆర్థిక సంస్థలు రక్షణ కోసం ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు సి ఐ టి యు మధురవాడ జోన్ కమిటీ తెలియ జేసింది.
ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను జీ వి ఎం సి జోనల్ 2 కార్యాలయం దరి అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళ వారం విడుదల చేశారు.ఈ సందర్భంగా సి ఐ టి యు జోన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి కొండమ్మ, పి రాజ్ కుమార్ మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అలాగే కార్మికులకు కనీస పింఛను 10 వేలు ఇవ్వాలన్నారు.ధరలు,పన్నులు ఇదివరకు ఎన్నడూ లేని విధంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుకుంటూ పోతున్నాయని అన్నారు.ఈ కారణంగా వేతనాలు చాలక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియ జేశారు.ఉద్యోగులకు సి పి ఎస్ ను రద్దు చేసి ఓ ఫీ ఎస్ పింఛను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. బడా పెట్టుబడి దారుల రుణాలు బీ జె పీ ప్రభుత్వం మాఫీ చేస్తుందని ఇది అన్యాయమన్నారు.అన్నం పెట్టే రైతన్నలు,కౌలు రైతుల అప్పులు మాఫీ చేయాలని కోరారు.కనీస మద్దతు ధరకు చట్ట బద్దత కల్పించాలని డిమాండ్ చేశారు.ఉపాధి హామీ పనులు సంవత్సరానికి 200 రోజులు కల్పించాలని,రోజు కూలీ 600/రూ ఇవ్వాలని,పట్టణ ప్రాంతాలకు ఈ పథకం వర్తించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చరియాలు తీసుకోవాలని కోరారు.పౌర సరఫరాలకు బడ్జెట్ లో కేటాయింపులు 3 లక్షల కోట్ల రూపాయల కు పేంచీ, 14 రకాల నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.చలో ఢిల్లీ కార్యక్రమం ప్రజానీకం అంతా జయప్రదం చేయాలని కోరారు. అదే రోజు ఇక్కడ జిల్లాల వారీగా జరిగే కార్యక్రమాలలో కార్మికులు,కర్షకుల పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సీఐటీయూ జోన్ నాయకులు డి అప్పలరాజు,వి సంధ్య,జీ చిన్నారావు,రాజు, విప్లవ కుమార్,జీ బంగార్రాజు,కుమారీ, తదితరులు పాల్గొన్నారు.

