కోవిడ్ తర్వాత రాష్ట్రంలో అనేక రకాలుగా అభివృద్ధి చేశాం ముఖ్య మంత్రి దృష్టి మొత్తం వైజాగ్ మీదే ఉంది.పర్యాటక శాఖ మంత్రి
పియం పాలెం వి న్యూస్ మార్చి 28
మధురవాడ జివియంసి 6వార్డు పరిధిలోని శిల్పారామం (జాతర)లో గాంధీ శిల్ప బజార్ ను సందర్శించిన రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పర్యటించారు అనంతరం ఆమె మాట్లాడుతూ విశాఖ,తిరుపతి,అనంతపురం, కడప,పులివెందుల,పుట్టపర్తి, విజయనగరం,కాకినాడ ఇలా 8 చోట్ల ఉన్నాయి రానున్న రోజుల్లో శ్రీకాకుళం ,చిత్తూరు, విజయనగరం కర్నూల్ లో శిల్ప రామాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు .
విశాఖ లో శిల్పారామం చాలా అద్భుతంగా ఉంది ఈ శిల్పారామంలో నెలకు 1.25 వేల మంది కుటుంబాలతో కలిసి శిల్పరామాన్ని సందర్శి స్తున్నారు వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి శిల్ప బజర్ ను ఏర్పాటు చేసి వాళ్ళు తయారు చేసే వస్తువులు ఇక్కడికి తీసుకువచ్చి అమ్మడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఎదో కార్యక్రమం పెట్టీ గత ప్రభుత్వాలు డబ్బు మింగడం తప్ప ఇంకేం చేయలేదు కోవిడ్ తర్వాత రాష్ట్రంలో అనేక రకాలుగా అభివృద్ధి చేశాం ముఖ్య మంత్రి దృష్టి మొత్తం వైజాగ్ మీదే ఉంది.రానున్న రోజుల్లో విశాఖను పరిపాలన రాజధానిగా చూస్తారు.

