జాతీయ ఉగాది పురస్కారాన్ని అందుకున్న దావాజిగూడెం యువకుడు అంతర్జాతీయ డి.ఓ.పి సాయి
గన్నవరం:
కృష్ణాజిల్లా గన్నవరం మండలం దావాజిగూడెం గ్రామానికి చెందిన డి. జి ఎం.ఎన్. సాయి కుమార్ ఆదివారం తిరుపతి యూత్ హాస్టల్ లోనిర్వహించిన సభలో జాతీయ స్థాయి ఉగాది పురస్కారాన్ని ఆయన అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన వే ఫౌండేషన్ అధ్వర్యంలో నిర్వహించిన సభలో విశిష్ట అతిధిఓ ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ రీజినల్ డైరెక్టర్,తిరుపతి హబ్ ఎపి.టి.డి.సిఎగ్జికూటివ్ డైరెక్టర్ డా.రావూరి రమణ ప్రసాద్,నిర్వాహకులు చేతులు మీదుగా అందుకున్నారు.ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ తమ వంటి కళాకారులను గుర్తించి ప్రోత్సహించిన వే ఫౌండేషన్ కమిటీ,వారికి తన ఉన్నతికి నిరంతరం ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.

