ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం ఉడుపు రాట

 ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం  మహోత్సవం ఉడుపు రాట

 మర్చి 30న శ్రీ విజయదుర్గా దేవి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కళ్యాణం


మధురవాడ  వి న్యూస్ -మార్చి 24): 


మధురవాడ టైలర్స్ కాలనీలో వేంచేసి యున్న శ్రీ విజయదుర్గా దేవి అమ్మవారి ఆలయ ఆవరణలో ఈ నెల మర్చి 30వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో శుక్రవారం అత్యంత ఘనంగా ఉడుపు రాట మహోత్సవం చేసారు . ఆలయ ధర్మకర్త బంగారు లక్ష్మీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శ్రీకాంత్ శర్మ పర్యవేక్షణలో     మంగళ వాయిద్యాల  మధ్య నాగేశ్వరావు, పార్వతి.నూకరాజు, ఉమా దంపతులచే ఉడుపు రాట పూజ నిర్వహించారు.

ఈ సందర్బంగా  ఆలయ ధర్మకర్త బంగారు లక్ష్మీ మాట్లాడుతూ ప్రతీ ఏడాది  మాదిరిగానే ఈ సంవత్సరం కూడా లోక కల్యాణార్థం శ్రీ సీతారాముల కళ్యాణం  మహోత్సవం చేస్తునట్టు తెలిపారు .ఈ మహోత్సవంలో స్థానిక  14 గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో కల్యాణంలో పాల్గొంటారని తెలిపారు . 

ఈ కార్యక్రమంలో ఆలయ దర్మకర్తమండలి సభ్యులు బంగారు ప్రకాష్,తెంటు అజయ్ కుమార్,తెంటు మాధవి, 7వ వార్డు వైఎస్సాఆర్ సీపీ అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు ,వైసీపీ సీనియర్ నాయకులు పసుపులేటి గోపి ,గుడివాడ లక్ష్మణ్ రావు,తమ్మినేని వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.