ఇది సీటీ బస్ కాదు ప్రభుత్వ అంబులెన్స్
పాడేరు:
ఆదివాసులకు అంబులెన్స్ లు కరువాయే
గిరిజనులకు తప్పని ఇక్కట్లు
అరకొర గా అంబులెన్స్ సేవలు పట్టించుకోని ప్రభుత్వం
అల్లూరి జిల్లా, పాడేరు ప్రభుత్వ హాస్పిటల్ లో అంబులెన్స్ లు కరువయే.పాడేరు నుండి విశాఖపట్నం కేజీహెచ్ కు వెళ్ళాలంటే కత్తిమీద సామే ఒక అంబులెన్స్ లో సీటీ బస్ లో వెళ్లినట్టు కిక్కిరిసిన జనంతో అనారోగ్యం తో ఉన్న బాధితులకు ఎలా సురక్షితంగా హాస్పిటల్ కు చేర్చగలరు అని బాధిత కుటుంబాలు వాపోయారు.
ప్రభుత్వ సిబ్బంది నుండి వెళితే వెళ్ళండి లేక పోతే మళ్ళీ వేరే అంబులెన్స్ లేదు మళ్ళీ వెళ్ళడానికి అవ్వదు,ఇక్కడ ఉంటే ఏమైనా మాకు సంబంధం లేదని ఒక పేపర్ మీద రాసి పెత్తి ఇవ్వండి అనే స్థాయికి వచ్చేశారు.ఇంతలా జరుగుతున్న కనీస అంబులెన్స్ సేవలు లేకపోవడం చాలా భాదకరం. ఇప్పటి కైన ప్రభుత్వం వారు,ప్రజా ప్రతినిధులు ,సంభందిత అధికారులు స్పందించి అంబులెన్స్ సేవలు పెంచాలని బాధిత కుటుంబాలు వాపోయారు.

