జె.కొత్తూరు గ్రామంలో బద్ది సురేష్,దేవిక దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా సీతారాముల కళ్యాణం
జె.కొత్తూరు గ్రామం:
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామంలో జనసేన పార్టీ మండల కార్యదర్శి బద్ది సురేష్,దేవిక దంపతులు సీతారాములవారికి పట్టువస్తాలు,ముత్యాల తలంబ్రాలు బియ్యం సమర్పించి స్థానిక రామాలయంలో సీతారాముల కళ్యాణం వేదమంత్రాలు నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సీతా రాముల కళ్యాణ మహోత్సవంలో బద్ది సురేష్,దేవిక దంపతులు కుటుంబ సభ్యులు సిరి,రిషిత, బద్ది రాంబాబు,సత్యవతి,బద్ది గిరిబాబు, సాయి,దేవిశ్రీ సత్య,జ్యోషి షణ్ముఖ ప్రియాంక మరియు రామాలయ కమిటీ సభ్యులు పెదపాటి నారాయణ రావు, పెదపాటి వెంకటేష్,కందికట్ల నాగు, సైనం కృపారావు,సైనం సత్తియ్య,సైనం లోవరాజు,కందికట్ల శ్రుంక రయ్య,నొక్కు నాగేశ్వరరావు,నొక్కు వెంకట్రావు, పెదపాటి దొంగోడు తదితరులు పాల్గొన్నారు.
