రాయిగేడ్డలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం

రాయిగేడ్డలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం

పోటెత్తిన భక్తులు

భారీ అన్న సమారాధన కార్యక్రమం

అల్లూరి జిల్లా, పాడేరు న్యూస్ మార్చి 30 :-

కల్యాణ వైభోగం టిడిపి రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి కోడ వెంకట సురేష్ కుమార్.

శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకొని పాడేరు మండలం ఈడ పల్లి పంచాయతీ రాయిగడ్డ గ్రామంలో గురువారం ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు బోయిని చిన్నయ్య వంతల గోపాలరావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలను తిలకించేందుకు వందలాదిమంది భక్తజనం పోటెత్తారు.అలాగే ఇందులో భాగంగా ఆరు కుటుంబాలు సీతారాముల వారి కల్యాణాన్ని కళ్యాణ్ర్థం జరిపించగా కళ్యాణ వేడుకలు తిలకించేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి కోడా వెంకట సురేష్ కుమార్, పాడేరు మండలం ఎస్టీ సెల్ కార్యదర్శి కంబిడి శివశంకర్, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పిఆర్ఓ కొర్ర కృష్ణారావు పాల్గొని సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తరించి గ్రామ పెద్దలు ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులతో మాట మంత్రి నిర్వహించి విందు ఆరగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కించే మత్స రాజు, కించే సూర్యనారాయణ, మోహన్ రావు, కించె వెంకటేశ్వర్లు, కాటారి రామకృష్ణ, వంతల కిషోర్ , కాటారి కామరాజు నాయుడు, భాస్కరరావు సత్యనారాయణ ఆలయ కమిటీ సభ్యులు గుడి పంతులు కించ సత్యనారాయణ అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.