జిల్లా రెవెన్యూ అధికారి ని సన్మానించిన చిందాడ గరువు గ్రామ ప్రజలు.
అమలాపురం. (వి న్యూస్ ప్రతినిధి) మార్చి ,30:
శ్రీరామనవమి సందర్భంగా చిందాడగరువు హనుమాన్ జంక్షన్ వద్ద ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో చిందాడగరువు ఎంపీటీసీ మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు దంపతులు ఆలయం వద్ద పీటల మీద కూర్చుని సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు .ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్. సత్తిబాబు దంపతులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నందున మోటూరి వెంకటేశ్వరరావు కనకదుర్గ దంపతులు సత్తిబాబు దంపతులకు సాలువ కప్పి ఘనంగా సత్కరించారు .ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు , చిందాడగరువు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు .

