భీమిలి ఆర్ టి సి కాంప్లెక్స్ అభివృద్ధి, తగరపువలస బస్సు షెల్టర్ నిర్మాణం చేపట్టాలి.
భీమిలి:
భీమిలిలో 1999లో కట్టిన ఆర్ టి సి కాంప్లెక్స్ కు బస్సులు రాకపోకలు లేక, ప్రయనీకులు రాకపోవటంతో, అధికారులు, రాజకీయ నాయకులు అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నించక పోవటంతో సిదిలావాస్తకు చేరుకుందని, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోలేని పరిస్థితి ఆర్ టి సి ఉందని అంటున్నారు. ఇప్పటికైనా భీమిలి ఆర్ టి సి కాంప్లెక్స్ ను అభివృద్ధి చేసి బస్సులు రాకపోకలు జరివిధంగా చూడాలని అలాగే తగరపువలస బస్సు స్టాప్ లో షల్టర్ కూడాలేక విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రస్తుతం ఎండ తీవ్రత రోజు రోజు కి పెరుగుతుందని అధికారులు గుర్తించి తగరపువలస బస్సు స్టాప్ లో షల్టర్ ఏర్పాటు చేసి విద్యార్థుల ఇబ్బందిని తొలగించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి,3వవార్డ్ టీడీపీ అధ్యక్షులు గంటా నూకరాజు కోరుతున్నారు.


.jpeg)