గోకపేటలోని గోకవానిచెరువును పరిశీలించడానికి వచ్చిన, నీటిపారుదల శాఖ అధికారులకు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణసమితి

గోకపేటలోని గోకవానిచెరువును పరిశీలించడానికి వచ్చిన, నీటిపారుదల శాఖ అధికారులకు  ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణసమితి

విజయనగరం:   

విజయనగరం  మండలం, విజయనగరం బిట్-1 రెవెన్యూ నందు గోకపేటలో ఉన్నటువంటి గోక వాని చెరువు సర్వే నెంబరు 9 విస్తీర్ణం సుమారు 10 ఎకరాలు అయితే ఇది గత రెండు సంవత్సరాల క్రితం నుంచి కబ్జా గురవుతూ వస్తుంది. ఈ కబ్జా గురవుతున్న విషయాన్ని స్పందన కార్యక్రమం ద్వారా గోకపేట గ్రామస్తులు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. తాసిల్దార్, రెవిన్యూ డివిజనల్ అధికారి వారికి, కలెక్టర్ వారికి పలుమార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆక్రమణదారుల పేర్లు భూ రికార్డుల నందు నమోదు చేసి, ఆన్లైన్ నందు చెరువు యొక్క పూర్తి విస్తీర్ణాన్ని కుదించడం కూడా జరిగింది.

2020 సంవత్సరంలో ఉన్నటువంటి ఆన్లైన్ రికార్డులకి, ప్రస్తుత రికార్డులకి తేడా కూడా అధికారులకు తెలియజేసినప్పటికీ వారు "స్పందన" కరువువడంతో, గోకపేట గ్రామస్తులు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితిని ఆశ్రయించడం జరిగింది.

అప్పుడు ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి విజయనగరంలో సమావేశం పెట్టి, ఆ చెరువు ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది.

అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగంలో స్పందన రాలేదు. యధావిదంగానే చెరువుని కబ్జా చేస్తూ, కబ్జాదారులు చెరువును పూడ్చివేస్తున్నప్పటికీ పంచాయతీరాజ్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇదే విషయాన్ని చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి గవిరెడ్డి రఘు సత్య సింహాచక్రవర్తి స్వయంగా వెళ్లి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలతో కూడినటువంటి తీర్పు నకలను జిల్లా కలెక్టర్ వారికి జత చేసి, మరొకసారి ఫిర్యాదు చేయడమైనది. ఆ స్పందనలో ఇచ్చినటువంటి ఫిర్యాదు పై "శుక్రవారం విజయనగరంలోని గోకపేట లో ఉన్న గోకవాని చెరువును యందు ఆక్రమణలను గుర్తించడానికి, నీటిపారుదల శాఖ అధికారి అయినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ వారు రావడం జరిగింది. వారిని కలిసి చెరువు యొక్క వివరాలు తెలియజేయడమైనది.  నీటిపారుదల అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆక్రమణలను గుర్తించి వాటిపై ఉన్నత అధికారులకు నివేదిక పంపిస్తామని వారు తెలిపారు.

          అదేవిధంగా ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ఫిబ్రవరి 20వ తారీకు తరువాత సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చినటువంటి చెరువులపై కాలువలపై, పోరంబోకు స్థలములపై, ఇచ్చిన తీర్పుని అమలు చేయని కారణంగా ఉత్తరాంధ్ర  చెరువుల పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షులు మరియు దక్షిణ భారతదేశ హిందూ మహాసభ ఆర్గనైజింగ్ సెక్రటరీ భారతానంద మహర్షి ఆధ్వర్యంలో ఆమరణ నిరాహారదీక్షకి పిలుపునివ్వడం జరిగింది.

రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయాలని అటువంటి ఈ అధికారులపై కోర్టుదిక్కరణ  కేసు నమోదు చేస్తూ, క్షేత్రస్థాయిలో దీక్షలకు దిగుతున్నామని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ప్రభుత్వం జారీ చేసింది.

ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి జాగరపు ఈశ్వర ప్రసాద్, కుమారు, సాగరు, శ్రీను స్థానికరైతులు పాల్గొన్నారు.