వాంబేకాలనీ మహిళలకు ఉచిత టైలరింగ్ మిషన్లు పంపిణీ చేసిన ఉపాహార్ సంస్థ.
వాంబేకాలనీ:
ఉపహార్ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న ఉపహార్ ఆశాదీవెన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో మధురవాడ వాంబేకాలనీ లో నివసిస్తున్న ఏ ఆధారం లేని పేద మహిళలకు టైలరింగ్ కోర్స్ 6నెలలపాటు ఉచితంగా నేర్పించి టైలరింగ్ కోర్స్ నేర్చుకున్న పదిమంది మహిళలకు ఉపహార్ అంతర్జాతీయ డైరెక్టర్ మరియు ఫౌండర్ అయిన డాక్టర్ రజిత్ కుమార్ పాణీ చేతుల మీదుగా పది మంది మహిళలకు కుట్టు మిషన్లు మరియు గుర్తింపు పత్రాలు అందచేశారు.టైలరింగ్ నేర్చుకున్న మహిళలు ఉపహార్ సంస్థ ప్రతినిధులు మాకు టైలరింగ్ కోర్స్ నేర్పించి కుట్టుమిషన్, గుర్తింపు ధ్రువపత్రాలు అందచేసినందుకు సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపహార్ ఇండియా మేనేజర్ బి ఎమ్ పాల్, ఉపహార్ సంస్థ విశాఖపట్నం ప్రతినిధులు బి బెంజిమెన్, బి బెన్యిమెన్, టీ ప్రసన్న కుమార్ ఈ ఎన్ బి రమాదేవి, అమీల్, రూపక్, టైలరింగ్ టీచర్, పది మంది మహిళలు పాల్గొన్నారు.
