ధర్మాన అంకుల్ ... ఈ అక్కను ఆదుకోరూ - మూడవ తరగతి విద్యార్థిని ట్వింకిల్

ధర్మాన అంకుల్ ... ఈ అక్కను ఆదుకోరూ - మూడవ తరగతి విద్యార్థిని ట్వింకిల్ 

శ్రీకాకుళం:

స్థానిక జెండాల వీధిలో నివాసం ఉంటున్న కే. సువాసిని  భర్త కొంత కాలం క్రితం చనిపోగా, కాంట్రాక్టు పద్దతిలో స్వీపర్ పని చేస్తూ  కుటుంబ భారాన్ని మోస్తుంది. తన కూతరు తనలా కాకూడదని కష్టతరమైనా తన కూతరుని స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివిస్తుంది. ఇంతలో విధి నాటకంలో భాగంగా ఉన్న ఒక్క గాన ఒక్క కూతురు యశోద అనారోగ్యం బారిన పడింది. ఒక్క సారిగా 45 కేజీల నుండి 17 కు బరువు తగ్గటంతో ఏం చెయ్యాలో, ఎవరిని సహాయం అడగాలో తెలియక వైద్య పరీక్షల నిమిత్తం శ్రీకాకుళం శ్రీ చక్ర వైద్యశాలలో చూపించగా యశోదకి దీర్ఘ కాళిక టీబీగా నిర్ధారించటంతో తల్లి దుక్కసాగరంలో మునిగింది. ఈ విషయం కాస్త యశోదకి తెలియటంతో ఏ తోడు లేని మాకు దిక్కెవరని, అమ్మకు సహాయ పడేవారు ఎవరూ లేరని రోజు బాధపడుతూ తనలో తానే కుమిలిపోతుంది. కుటుంబ సభ్యులలో ఒకరైన జగదీష్ సామాజిక కార్యకర్త ట్వింకిల్ ని సంప్రదించగా విషయం తెలుసుకున్న స్వచ్ఛంద సమస్త సభ్యులు సుప్రజ దేవి, శిస్టు  మనోజ్, ఐవిఎస్  హర్ష  లకు తెలియటంతో తన వంతు సాయంగా ప్రతి నెలా యశోదకు అయ్యే మందులను అందజేస్తాని ముందుకు వచ్చి నెలకు సరిపడే మందులను ఈ రోజు అందజేసి మాట్లాడుతూ శ్రీకాకుళం రవీంద్ర భారతిలో మూడవ తరగతి చదువుతూ, చిన్నతనంలోనే సామాజిక సేవ చేస్తున్న ఉర్లం ట్వింకిల్ యశోద కుటుంబ దీన స్థితిని చెప్పిందని, తనని స్ఫూర్తిగా తీసుకొని సాయం చెయ్యటానికి ముందుకు వచ్చామని తెలిపారు. ట్వింకిల్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం మన ధర్మమని, శ్రీకాకుళం లో స్వచ్ఛంద సంస్థలు,  సాయం చేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారని, ధర్మాన అంకుల్ ఈ అక్కను ఆదుకోరూ అంటూ ధర్మాన సోదరులను సైతం కోరింది. ఏ విషయాన్నైనా ప్రజలకు చేరాలన్న, కార్యాచరణ దాల్చాలన్న అందుకు  పాత్రికేయుల సహకారం ఉండాలని, మీ పత్రికలు ద్వారా ఈ అక్కకు సాయం చెయ్యాలని తెలిపి, యశోదకు సాయం చేసిన సబ్యులకు ధన్యవాదాలు తెలిపింది. సాయం చేయాలనుకునే వారు చరవాణి ని సంప్రదించగలరు. 9160251326 

ఈ కార్యక్రమంలో ట్వింకిల్ తో పాటు స్వచ్ఛంద సమస్త వాలంటీర్ లు అరుణ్, ప్రవీణ్, ఉదయ్, శ్రీధరలు లు పాల్గొన్నారు.