వాంబే కాలనీలో భారీగా జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు.
వాంబే కాలనీ:
శివరాత్రి సందర్భంగా శనివారం ఉదయం 6గంటలకు జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ డా సందీప్ పంచకర్ల నాయకత్వంలో 7వ వార్డ్ వాంబే కాలనీ శివాలయం వద్ద ఒమ్మి దేవి యాదవ్, సాగర్ మల్ల , యాళ్ల విజయ్, వావులపల్లి చిన్న, ఆకుల శివ,యార్ణగుల సుధీర్, వెనుగుల శ్రీను ఆధ్వర్యంలో జనసేనాని ఆశయాలు, సిద్ధంతాలు ప్రజలకు తెలియజేస్తూ జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కొరకు ప్రచారం చేసే కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో శివాలయానికి విచ్చేసిన భక్తులకు ప్రసాద పంపిణి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రెడ్డి రాజు,తరుణ్ , కనకమ్మ, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.


