ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఘనంగా"సై-లాండ్"- 2023
మంగళవారం,లక్ష్మీ నారాయణ్ నగర్, కాకినాడ.
స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో సైన్స్ ఎగ్జిబిషన్ "సై-లాండ్"- 2023 కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించినట్లు ఆదిత్య డిగ్రీ మరియు పీజీ కళాశాలల అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ బి ఈ వి ఎల్ నాయుడు తెలిపారు.
శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పెంపొందించి, నూతన ఆవిష్కరణలు జరిగే విధంగా విద్యార్థులలో సరికొత్త ఆలోచనలు రేకెత్తించే సైన్స్ ఎగ్జిబిషన్ "సై-లాండ్"- 2023 రెండు రోజుల కార్యక్రమం ఆదిత్య డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ఘనంగా ప్రారంభమైంది. ఆదిత్య డిగ్రీ కళాశాలలో బి ఎస్ సి మరియు ఎమ్మెస్సీ చదువుతున్న విద్యార్థులు బృందాలుగా ఏర్పడి వారి ఆలోచనలకు సాంకేతికతను జోడించి వారు రూపొందించిన ప్రాజెక్టులను సైన్స్ ఎగ్జిబిషన్ "సై-లాండ్" లో ప్రదర్శించారు. భౌతిక, రసాయన, జీవ, గణాంక శాస్త్రం, ఎలక్ట్రానిక్ మరియు కామర్స్ విభాగాల్లో 150 పైగా అంశాలను రూపొందించి, సమాజానికి వాటి ఉపయోగాలను వివరించారు.
జ్యోతి ప్రజ్వలన మరియు ప్రార్థన గీతంతో ప్రారంభమైన సైన్స్ ఎగ్జిబిషన్ "సై-లాండ్"- 2023 కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ నల్లమిల్లి సుగుణా రెడ్డి మాట్లాడుతూ ఈ విధమైన కార్యక్రమాలు విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తాయని, నూతన పరిశోధనలకు అవకాశం కల్పిస్తాయని అన్నారు. ప్రాజెక్టులు రూపొందించిన విద్యార్థులను వారిని ప్రోత్సహించిన తల్లిదండ్రులను మరియు అధ్యాపకులను అభినందించారు
ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇస్రో ఫార్మర్ సైంటిస్ట్ డాక్టర్ వై శివప్రసాద్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత దేశం విజ్ఞాన గని అని, విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు సమాజానికి చాలా ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు పరిశోధన రంగంలోకి రావాలని పిలుపునిచ్చారు. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో మరిన్ని నూతన ఆవిష్కరణలు జరగాలని తెలిపారు.
గౌరవ అతిథిగా విచ్చేసిన ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల కెమిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ పీవీఎస్ మాచిరాజు మాట్లాడుతూ ఆదిత్య విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలలో ముందు ఉండడం అభినందనీయమని అన్నారు. కెమిస్ట్రీ క్లబ్ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుల ఎగ్జిబిషన్ ను రిబ్బన్ కతరించి ప్రారంభించారు. ఉత్తమ ప్రాజెక్టు రూపొందించిన విద్యార్థులను అభినందించారు.
అతిథిగా విచ్చేసిన నైరోస్ టెక్నాలజీ సీఈవో ఎం పవన్ కుమార్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుల ఎగ్జిబిషన్ ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి విద్యారంగంలో కంప్యూటర్ సైన్స్ యొక్క ఆవశ్యకతను వివరించారు. ఉత్తమ ప్రాజెక్టులు తయారు చేసిన విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన రోబోజెన్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ ఆదిత్య డిగ్రీ కళాశాలలో గత నాలుగు సంవత్సరాలుగా సై-లాండ్"
సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం అభినందనీయమని, ఎంతోమంది నూతన పరిశోధకులకు ఇలాంటి కార్యక్రమం నాంది పలుకుతుందని అన్నారు.
ఈ సందర్భంగా అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక జ్ఞానంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా అభ్యసించినప్పుడే పరిపూర్ణం అవుతారని అన్నారు.ఆదిత్య డిగ్రీ కళాశాలలో అధునాతన ప్రయోగశాలలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు పరిశోధకులుగా ఎదగాలని అందుకు ఈ విధమైన సైన్స్ ఎగ్జిబిషన్స్ ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు రూపొందించిన నూతన ప్రయోగాలు తక్కువ ఖర్చుతో సమాజహితంగా ఉన్నాయని అన్నారు. రెండు రోజులు జరిగే ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ను వివిధ కళాశాలల విద్యార్థులు సందర్శిస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు.
ఈ ఎగ్జిబిషన్ లో మోషన్ ఆఫ్ ఏ రాకెట్, త్రీడీ హలోగ్రామ్, సోలార్ బోట్, ఆల్కహాల్ డిటెక్టర్, బయో ఆర్గానిక్ ఫార్మ్ , రైన్ డిటెక్టర్, కిడ్నీ క్యాన్సర్, సి వాటర్ డిసాల్నేషన్, టైం స్పెంట్ ఆన్ స్టడీస్, ఫ్ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ వంటి అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తమ ప్రాజెక్టులు నిర్వహించిన విద్యార్థులకు జ్ఞాపికలు మరియు ప్రశంసాపత్రాలను అందజేశారు. అనంతరం వివిధ సైన్స్ క్లబ్స్ విద్యార్థులు రూపొందించిన సైన్స్ మ్యాగజైన్స్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆదిత్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి సైన్స్ ఎగ్జిబిషన్ "సై-లాండ్"- 2023 నిర్వహించిన సైన్స్ విభాగాల అధ్యాపకులను, ఎగ్జిబిషన్ కో ఆర్డినేటర్ ఎన్ మూర్తి ని అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.


