నూతన డెయిరీ చైర్మన్ ఆనంద్ కు అభినందనల వెల్లువ
రామభద్రపురం:
విశాఖ డెయిరీ నూతన చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆడారి ఆనంద్ కుమార్ కు స్థానిక యూనిట్ పరిధిలో బోర్డ్ డైరెక్టర్ అమ్మలు,మేనేజర్ రామచంద్రరావు ఆధ్వర్యంలో సూపర్వైజర్ లు సిబ్బంది, అన్ని పాల సంఘాల అద్యక్షులు,కార్యదర్శులు,గ్రూపు లీడర్ లు అభినందనలు తెలిపారు. విశాఖ డెయిరీ పాలక వర్గ సమావేశం లో డైరెక్టర్ లంతా ఏకగ్రీవంగా ఆనంద్ నాయకత్వాన్ని బలపరచి చైర్మన్ పీఠం పై ఆశీనులను చేశారు. తండ్రి తులసీరావు బాటలో నడిచి రైతు శ్రేయస్సు కు కృషి చేస్తూ రైతు బంధుగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక బోర్డ్ డైరెక్టర్ శoబంగి అమ్మలు మాట్లాడుతూ దివంగత మహానేత తులసీరావు మరణం పాడి రైతులకు తీవ్ర దుఃఖాన్ని కలిగించిందని, అయితే ఆయన ఆశయాలు సాధ్యం చేయడం ఆనంద్ కుమార్ తో నే సాధ్యం అన్నారు. మనమంతా తులసీరావుకు ఇచ్చిన ఆదరణ ఆనంద్ కుమార్ కు ఇచ్చి డెయిరీ పురోభివృద్ధికి సహకరించాలని కోరారు.

