వెబ్ ఛానల్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ

వెబ్ ఛానల్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ

విశాఖసిటీ: 

వెబ్ ఛానల్ అసోసియేషన్ 2023 నూతన సంవత్సర డైరీను విజెఎఫ్ అధ్యక్షుడు సింహాచలం దేవస్థాన బోర్డ్ మెంబర్ గంట్ల శ్రీను బాబు ఆవిష్కరించారు ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ వార్తా సేకరణ ప్రజలకు వార్తలను సమా చారాన్ని చేరవేయడంలో వెబ్ ఛానల్ జర్నలిస్టులు ముందున్నా రన్నారు ప్రతీ రోజు దినచర్యను ముఖ్య విశేషాలను డైరీలో పొందు పరచుకోవడం ఎంతో ముఖ్యం అన్నారు వెబ్ ఛానల్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. రామకృష్ణ మాట్లాడుతూ జర్నలిస్టు లకు,సామాన్య ప్రజలకు డైరీ అనేది ఎంతో ముఖ్యమన్నారు ముఖ్య అంశాలను పొందుపరచుకునే విధానంలో డైరీలు ప్రధమ స్థానం వహిస్తాయన్నారు వెబ్ ఛానల్ జర్నలిస్టుల అభివృద్ధికి అహర్నిశలు సహకరిస్తూ తమ వెంట ఉన్న గంట్ల శ్రీనుబాబుకు ఈ సందర్భంగా ధన్య వాదాలు తెలిపారు ఈ కార్యక్రమం లో సీనియర్ జర్నలిస్టులు సతీష్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు