జనసేన పార్టీలో చేరిన జీవీఎంసీ 32వ వార్డ్ కార్పొరేటర్ కందుల నాగరాజు.
విశాఖపట్నం:
విశాఖపట్నం గ్రేటర్ నగర పాలక సంస్థ 32వ వార్డ్ కార్పొరేటర్ కందుల నాగరాజు గురువారం జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన కండువా వేసి కందుల నాగరాజుని పార్టీలోకి ఆహ్వానించారు. కందుల నాగరాజు తన అనుచరులతో కలసి పార్టీలో చేరారు.
