బీసీ లకు గత మూడున్నర సంవత్సరాల నుండి తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది.గొల్లంగి ఆనందబాబు

 బీసీ లకు గత మూడున్నర సంవత్సరాల నుండి తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది.గొల్లంగి ఆనందబాబు


మధురవాడ వి న్యూస్ 2022 డిసెంబర్ 05


తెలుగుదేశం పార్టీ స్టేట్ బిసి సెల్ ఆదేశాల మేరకు భీమిలి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి కోరాడ రాజబాబు నాయకత్వంలో, జీవీఎంసీ 6వ  వార్డ్ ప్రెసిడెంట్ దాసరి శ్రీనివాస్ అద్వ్యరం లో, వార్డ్ బీసీ సెల్ ప్రెసిడెంట్ రెడ్డి సత్యనారాయణ అద్వ్యక్షతనలో,ముఖ్య అతిథిగా రాష్ట్ర బిసి  పెడరేషన్ ఉపాఢ్యక్షులు ఆనందబాబు గొల్లంగి,విచ్చేసారు.బీసీ లకు జరుగుచున్న, అన్యాలపై,విశాఖ చినగదిలి రూరల్ మండలం, డిప్యూటి తహలసిద్దార్ మురళి కి, వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా రాష్ట్ర బిసి  పెడరేషన్ ఉపాఢ్యక్షులు ఆనందబాబు మాట్లాడుతూ

రాష్ట్ర జనాభాలో 50 శాతం పైగా జనాభాగా ఉన్న వెనుకబడిన తరగతుల (బీసీ)కు గత మూడున్నర సంవత్సరాల నుండి తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది. చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకుంటూ జీవనం పొందే బీసీల అభివృద్ధి, పురోభివృద్ధి మృగ్యమైపోయింది. బీసీలు హక్కుగా పొందాల్సిన సబ్ ప్లాన్ నిధుల నుండి.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వరకు ప్రతి అంశంలో నిరాదరణకు, దగాకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యల కారణంగా ఆర్ధిక, సామాజిక, రాజకీయంగా అనేకానేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. పైగా కార్పొరేషన్, సబ్ ప్లాన్ నిధుల్ని మళ్లించి బీసీలకు అన్యాయం చేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తీవ్రమైన అన్యాయానికి గురవుతున్నారు.


స్థానిక సంస్థల ఎన్నికల్లో రద్దు చేసిన 10 శాతం రిజర్వేషన్ల పునరుద్ధరణకు శాసనసభలో తీర్మానం చేయాలి. అందుకు ఎంపీలు పార్లమెంటులో కేంద్రంపై ఒత్తిడి చేయాలి. దారి మళ్లించిన బీసీ సబ్ ప్లాన్ నిధుల్ని బీసీల పురోభివృద్ధి కోసం తిరిగి ఇవ్వాలి. ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాలి. జనాభా దామాషా ప్రకారం 56 బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించి, ఖర్చు చేయాలి. షరతులు లేకుండా విదేశీ విద్య పథకాన్ని కొనసాగించాలి. ప్రభుత్వ సలహాదారులు, వైస్ ఛాన్సులర్లలో 34శాతం బీసీలకు ఇవ్వాలి. చేనేతలకు సబ్సిడీ పథకాలు పునరుద్దరించాలి. కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా నిధులివ్వాలి. మత్స్యకారులకు సబ్సిడీపై వలలు, పడవల పంపిణీ పునరుద్ధరించాలి. జీవో నెం. 217ను రద్దు చేయాలి. బీసీలకు చిన్న, మధ్యతరగతి పరిశ్రమల ఏర్పాటుకు అందించే రాయితీలను పునరుద్ధరించాలి. బీసీ స్టడీ సర్కిళ్లకు పూర్వ వైభవం కల్పించాలి. బీసీ నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకుకోవాలని కోరుతున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గురునాద్,వార్డ్ సెక్రటరీ నాగేశ్వరరావు,వార్డ్ మహిళ అద్వ్యక్షురాలు బబ్బేలు,వార్డ్ యూత్ ప్రెసిడెంట్ నక్కా రమణ,వార్డ్ వైస్ ప్రెసిడెంట్ కొరగంజి సూరిబాబు,వార్డ్ సీనియర్ నాయకులు సర్వదేముల్లు,  తదితరులు పాల్గొన్నారు..