35వ సచివాలయంను ఆకస్మికంగా సందర్శించిన జెడ్సి

 35వ సచివాలయంను ఆకస్మికంగా సందర్శించిన జెడ్సి.                                                                              

వాలంటీర్లు పథకాలపై పూర్తిఅవగాహనతో పని చేయాలి.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూడాలి.

జీవీఎంసీ జోన్-2 కమిషనర్  బొడ్డేపల్లిరాము.                               ఎంవి న్యూస్  ప్రతినిధి మధురవాడ: 

జీవీఎంసీ జోన్-2 పరిధి 5వవార్డ్ బోరవానిపాలెం లో గల 35వ సచివాలయాలను సోమవారం జోనల్ కమిషనర్ బొడ్డేపల్లిరాము ఆకస్మికంగా సందర్శించారు.సచివాలయ సెక్రటరీల హాజరు,వారి పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.సచివాలయంలో రిజిస్టర్లు,బయోమెట్రిక్ విధానాన్ని,వివిధ పథకాల లబ్దిదారులు వివరాలను ప్రదర్శించే బోర్డులను,రికార్డులను పరిశీలించారు.

సచివాలయం ద్వారా అందుతున్న సేవలను వాలంటీర్లు లబ్ధిదారులకు తెలియజేయాలని కోరారు. ప్రజలకు అందుతున్న సేవలను,ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసే విధంగా నోటీస్ బోర్డులో ప్రదర్శించాలని, అదేవిధంగా సచివాలయం పరిధిలో ఉన్న ప్రజల పూర్తి వివరాలు ఆయా సచివాలయ రికార్డులలో పొందుపరచాలని సిబ్బందికి సూచించారు.అనంతరం సచివాలయ ఉద్యోగులతో మాట్లాడారు. సచివాలయఉద్యోగులకు, వాలంటరీలకు ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలన్నింటి పైనా పూర్తిగా అవగాహన ఉండాలని సూచించారు.పథకాలు పొందేందుకు లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలు, మినహాయింపులు వంటి వాటిపై క్షుణ్ణంగా అవగాహన ఏర్పర్చుకోవాలన్నారు.ఈ  సందర్భంగా సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని,పలు సూచనలు,సలహాలు ఇచ్చారు.