ఎంవీవీకి రూ.62 కోట్ల టీడీఆర్ ధారదత్తం

 ఎంవీవీకి రూ.62 కోట్ల టీడీఆర్ ధారదత్తం 

సోషల్ వెల్ఫేర్ స్థలం కబ్జాకు సహకారం

కోట్లలో అధికారులకు ముడుపులు

జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్

విశాఖపట్నం, వి న్యూస్ డిసెంబర్ 5 :-

నగరంలోని సి బి సి ఎన్ సి స్థలానికి సంబంధించి ఎంపి ఎంవీవీ సత్యనారాయణకు రూ. 62కోట్ల టీ డీ ఆర్ ధారాదత్తం చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు.   18,390 గజాల స్థలం, సోషల్ వెల్ఫేర్ 3,600 గజాల స్థలాన్ని కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్ కు స్పందనలో ఫిర్యాదు చేశారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వైజాగ్ స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ జీవిలు నగరంలోని  స్థలాలను కాజేయడమే కాకుండా అడ్డగోలుగా జీవీఎంసీ నుంచి రూ.62 కోట్ల టీ డీ ఆర్ ఖాజేసారాన్నారు. కోట్లలో ముడుపులు అందుకున్న అధికారులు వారికి సహాయం చేస్తున్నారని ఆరోపించారు.  రాష్ట్ర చరిత్రలో రోడ్లు వేయకుండా, డోర్ నెంబర్ లేకుండా జీవో నెంబర్ 345 పేరుతో అడ్డగోలుగా రూ.62 కోట్ల టిడిఆర్ ఇవ్వటమే  జీవీఎంసీ అధికారుల అవినీతికి నిదర్శమన్నరు. సీ బి సి ఎన్ సి స్థలం 18 క్రిస్టియన్ సంస్థలకు చెందగా, ఒకే వ్యక్తి దినకర్ త్యాగరాజన్ కు టి డి ఆర్ ఇవ్వడం అధికారులు అందుకున్న కోట్ల ముడుపులకు రుజువులన్నరు.  సర్వేనెంబర్ 75/4లో 3,600 గజాల ప్రభుత్వ బాలికల హాస్టల్ స్థలాన్ని గిఫ్ట్  డిడి, తనఖా రిజిస్ట్రేషన్ చేసేసారన్నారు. వీటిపై హైకోర్టు, జిల్లా కోర్టులో పిటిషన్లు ఉన్నాయని, కోర్టు వివాదాల్లో ఉండగా రూ.500 కోట్ల విలువైన స్థలాన్ని ఏ విధంగా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వైజాగ్ స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్ జీవీలకు కట్ట పెట్టడానికి టిడిఆర్, ప్లాన్ ఇచ్చేస్తారని ఆయన మండిపడ్డారు. వీటిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి కోట్ల రూపాయల అవినీతిని అరికట్టి, ఇందుకు కారకులైన ప్రభుత్వ అధికారులతో పాటు కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోషల్ వెల్ఫేర్కు కేటాయించిన 3600 గజాల  స్థలాన్ని సర్వే చేసి హద్దులు వేయాలన్నారు. ఆ స్థలంలో వసతి గృహాలు నిర్మాణం చేసి బడుగు బలహీన వర్గాలకు వసతి కల్పించాలన్నారు. ప్రభుత్వ స్థలాలు పరికక్షించాల్చిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రాజకీయ నాయకులకు ప్రయోజనాలు కల్పించడం మాని ప్రజల కోసం పని చేయాలన్నారు. ప్రభుత్వ స్థలాల జోలికి వస్టే న్యాయ పోరాటం చేసి కాపడతామన్నారు. జిల్లా కలెక్టర్ సిబిసిఎన్ సి స్థలాల టీ డీ ఆర్ కేటాయింపు, సోషల్ వెల్ఫేర్ స్థలం పై విచారణ చేపడితే జీవీఎంసీ అధికారుల అవినీతి భాగోతం బయటపదుతుందన్నారు. ఆ దిశగా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు భోగిల శ్రీనివాస పట్నాయక్, సాయికుమార్ మరియు ఎర్రయ్య పాల్గొన్నారు.