రహదారి సమస్యలు పరిష్కారం కు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పరిశీలన

 రహదారి సమస్యలు పరిష్కారం కు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పరిశీలన

మధురవాడ వి న్యూస్ 2022 డిసెంబర్ 05:

మధురవాడ రైతు బజారు వద్ద  ట్రాఫిక్ ఇబ్బందులు కొంతవరకైనా తగ్గించడానికి జి వి ఎం సి  ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మత్సరాజు  పరిశీలించారు.

జీవీఎంసీ జోన్ 2 కార్యాలయంలో సీఐటీయూ ఆధ్వర్యంలో రైతు బజార్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించడానికి మరియు  పెద్ద కాలువా పైన వున్న స్లాబలు తీసి ఎత్తు తగ్గిస్తే మలుపులో దారి వెడల్పు అవుతుందని,ఇలా చేయడం వలన రైతు బజారు లోపలనుండి వచ్చే వాహనాలు సులువుగా మలుపు తిరుగు తాయని,కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని కాబట్టి కాలువ పై సుమారుగా 10 అడుగుల మలుపు ప్రాంతం వెడల్పు అవుతుందని, అధువలన కాలువ పై కాంక్రీట్ పలకలు ఎత్తు తగ్గించాలని సోమవారం స్పందన కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. 

వెంటనే స్పదించిన జెడ్ సి. బి .రాము,ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మత్యరాజు కి ఆదేశాలు జారీచేశారు.వెంటనే ఇ ఇ   వున్నపలంగా రైతు బజార్ వద్ద వున్న కల్వర్టు ను పరిశీలించారు.ఈ సందర్భంగా ఇ ఇ మాట్లాడుతూ రైతు బజార్ లోపలి రహదారి నుండి బైటి కీ వచ్చేసరికి మలుపు వద్ద సుమారు 6 అడుగులు పైగా కాలువ శ్లాభులు ఎత్తు ముందుకు వచ్చాయని దీనిపై చర్చించి  తప్పకుండా సమస్య పరిష్కారం చేస్తామని తెలియ జెసారు.ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుందని అన్నారు.స్వయం కృషి నగర్ లో ఆక్రమణలో ఉన్న 12 అడుగుల సి సి రహదారి స్థలం ను స్వాధీనం చేసుకుని రహదారి పూర్తి చేయాలని తెలపగ .సర్వే చేసి సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో  సీఐటీయూ అధ్యక్షలు ,కార్యదర్శులు డి అప్పలరాజు,పి రాజు కుమార్,స్థానికులు టి కే శారద,ఎస్ ప్రసాద్, ఎస్ రామప్పడు, కే కొందమ్మ్ తదితరులు పాల్గొన్నారు.