బీసీలను దగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం...!*టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు
భీమిలి వి న్యూస్ 2022 డిసెంబర్ 05
రాష్ట్ర జనాభాలో 50 శాతంకి పైగా ఉన్న వెనుకబడిన తరగతుల ( బిసి) ను గత మూడున్నర సంవత్సరాలుగా నయవంచనకు గురిచేస్తూ, తీవ్రమైన అన్యాయానికి గురయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కురుపాం నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు విమర్శించారు.తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం పిలుపుమేరకు సోమవారం భీమిలి జోన్ లో ఉన్న 1,2,3,4 వార్డుల నాయకులు బీసీలకు జరుగుతున్న అన్యాయంపై తహశీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ శ్రీనుబానుకి వినతిపత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా గంటా నూకరాజు మాట్లాడారు. చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకుంటూ జీవనం పొందే బీసీల అభివృద్ధి , పురోభివృద్ధి మృగ్యమైపోయిందని అన్నారు. బీసీలు హక్కుగా పొందాల్సిన సబ్ ప్లాన్ నిధుల నుండి .. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కేటాయింపు వరకు ప్రతీ అంశంలో నిరాదరణకు, దగాకు గురవుతున్నారని అన్నారు. జీఓ నెంబర్ 217 ను రద్దు చేయాలని, మత్స్యకారులకు సబ్సిడీపై వలలు, పడవలు పంపిణీ చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యల కారణంగా ఆర్థిక, సామాజిక, రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 56 కార్పొరేషన్లు ఎర్పాటు చేసినా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి న్యాయం చేయాలని గంటా నూకరాజు కోరారు.1వ వార్డు పార్టీ అధ్యక్షులు తమ్మిన సూరిబాబు మాట్లాడుతూ దారి మళ్లించిన బిసి సబ్ ప్లాన్ నిధుల్ని బీసీల పురోభివృద్ధికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదరణ పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు. మాజీ కౌన్సిలర్ చురకల రమణ మాట్లాడుతూ షరతులు లేకుండా విదేశీ విద్యకు నిధులు కేటాయించాలని కోరారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీలకు ఈ విధంగా అయితే కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చారో, నేటి ప్రభుత్వం కూడా ఇవ్వాలని డిమాండ్ చేసారు. మాజీ కౌన్సిలర్ చిలక నర్సింగరావు మాట్లాడుతూ చేనేతలకు సబ్సిడీ పథకాలు పునరుద్ధరించాలని అన్నారు. 4వ వార్డు అధ్యక్షులు పాసి నర్సింగరావు మాట్లాడుతూ ఈ మూడున్నర సంవత్సరాలలో అక్రమంగా బీసీ నేతలపై పెట్టిన కేసులను ఉపసహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాసరపు నాగరాజు, పెంటపల్లి యోగీశ్వరారావు, కనకల అప్పలనాయుడు, దొంతల పైడిరాజు, మాజీ కౌన్సిలర్ పుక్కళ్ళ లక్ష్మీ కుమారి, మద్దిల సుబ్బారావు, నరవ రామారావు, బంక ప్రసాద్, గణేష్ రెడ్డి, పైడిపల్లి నర్సింగావు, సన్యాసిరావు వాడమొడలు రాంబాబు, అశోక్ తదతరులు పాల్గొన్నారు.

