చంద్రంపాలెం జాతర గట్టు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో హనుమద్వ్రతం కార్యక్రమం

 చంద్రంపాలెం జాతర గట్టు పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధలతో హనుమద్వ్రతం కార్యక్రమం  

మధురవాడ వి న్యూస్ 2022 డిసెంబర్ 05

విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో క్షేత్ర ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం హనుమద్వ్రతం కార్యక్రమం అలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు, ముందుగా స్వామి వారికి సుప్రభాత సేవతో ప్రారంభమై సుగంధ ద్రవ్య జలాభిషేకములు జరిపి ప్రత్యేకంగా వివిధ రకాల ఫలములతో అలంకరణ చేయడం జరిగింది, అనంతరం నాగవళ్ళీ దళార్చనలు సుంధూరార్చనలు పుష్పార్చన మొదలగు పూజా కార్యక్రమాలు జరిపించడం జరిగింది, అనంతరం హనుమద్ హవనం హోమం జరిపించడం జరిగింది, ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణము జరిపించడం జరిగింది.

హనుమద్వ్రతం కార్యక్రమం పురస్కరించుకుని ఆలయ కమిటి సభ్యులు భక్తులు హనుమాన్ దీక్ష చేపట్టి ఈరోజుతో ధీక్ష పూర్తి చేసుకొని ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు హరి ప్రసాద్ కు, హరిస్వామి ద్వారా ఇరుముడ్లు కట్టుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మరల పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఇరుముడి సమర్పించి ధీక్ష విరమణ చేయడం జరిగింది, అనంతరం స్వాములకు, భవానీలకు ఆలయానికి వఛ్చిన భక్తులకు బిక్ష (అన్న ప్రసాదాన్ని) ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పిళ్లా సూరిబాబు, అయ్యప్ప గురుస్వామి పిళ్లా వెంకటరమణ, ఉపాధ్యక్షులు పి.వి.జి. అప్పారావు, సెక్రటరీ నాగోతి తాతారావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పీస రమణ, సభ్యులు పోతిన పైడిరాజు, గూడేల రాజు, యస్.ఆర్. బాబు, పిళ్లా మోహన్ శివ కృష్ణ  పోతిన శివ అప్పారావు, పిళ్లా రమణ, కేశనకుర్తి అప్పారావు, దుక్క వరం,   పొట్నూరి హరికృష్ణ, నాగోతి అప్పలరాజు, బంక వాసు, దుర్గాశి శోభన్ బాబు, పిళ్లా శ్రీను,  గ్రామ పెద్దలు పిళ్లా చంద్రశేఖర్, పీస రామారావు, పిళ్లా శ్రీనివాసరావు, జగుపిల్లి నాని, పిళ్లా సత్యన్నారాయణ, ముఖ్య సభ్యులు పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు, జగుపిల్లి అప్పారావు పిళ్లా పోతరాజు , పిళ్లా రాము, పిళ్లా వెంకటరమణ, పిళ్లా అప్పన్న, యమ్. వెంకటరావు,